కెప్టెన్ విజయ్‌కాంత్‌.. కుటుంబం నేపథ్యమిదే! | Actor-Turned Politician Vijayakanth Family Details Inside - Sakshi
Sakshi News home page

Vijayakanth: కెప్టెన్ విజయ్‌కాంత్‌.. పదకొండు మందిలో ఒకడు!

Published Thu, Dec 28 2023 10:56 AM

Actor Cum Politician Vijayakanth Family Details Inside - Sakshi

సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. తమిళనాడు డీఎండీకే అధినేత, నటుడు విజయకాంత్‌ కన్నుమూశారు. చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న ఆయన తుదిశ్వాస విడిచారు. కొద్ది సేపటి క్రితమే కరోనా సోకినట్లు ప్రకటించిన వైద్యులు ఆయన మృతి చెందినట్లు తెలిపారు. విజయ్‌కాంత్ మృతి పట్ల కోలీవుడ్ ప్రముఖులు, రాజకీయ నాయకులు సంతాపం ప్రకటించారు. 

కుటుంబ నేపథ్యమిదే.. 

విజయకాంత్‌ 1952 ఆగస్టు 25న తమిళనాడులోని మధురైలో జన్మించారు. విజయ్‌కాంత్ అసలు పేరు నారాయణన్‌ విజయరాజ్‌ అళగర్‌స్వామి. చిత్ర పరిశ్రమలోకి వెళ్లిన తర్వాత విజయకాంత్‌గా పేరు మార్చుకున్నారు. కె.ఎన్‌. అళగర్‌స్వామి, ఆండాళ్‌ ఆయన తల్లిదండ్రులు. 1990లో జనవరి 31న ఆయన ప్రేమలతను పెళ్లి చేసుకున్నారు. 

వీరిద్దరికి  విజయ్ ప్రభాకర్, విఘ్నేష్ పాండియన్ అనే  ఇద్దరు కుమారులు ఉన్నారు. వారిలో ఒకరైన షణ్ముఖ పాండియన్‌ సగప్తం, మధుర వీరన్‌ చిత్రాల్లో నటించారు. విజయ్ కుటుంబం చాలా పెద్దది. విజయ్‌కాంత్‌కు ఐదుగురు సోదరులు, ఐదుగురు సోదరీమణులు ఉన్నారు.

రాజకీయాల్లోకి ఎంట్రీ 

సినిమాల్లో తనదైన నటనతో గుర్తింపు తెచ్చుకున్న విజయ్‌కాంత్‌ రాజకీయాల్లో అడుగుపెట్టారు. 2005లో డీఎండీకే పార్టీని స్థాపించి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ప్రజలకు సేవల చేయాలనే ఉద్దేశంతో ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. 2006, 2011 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత 2016 ఎన్నికల్లో పరాజయం పొందారు. ఆయన డీఎండీకే పార్టీ ఎన్నికల సమయంలో ఏ ఇతర పార్టీతోనూ పొత్తు పెట్టుకోకపోవడం విశేషం.

Advertisement
 
Advertisement
 
Advertisement