రవాణా సౌకర్యాలతోనే అభివృద్ధి | - | Sakshi
Sakshi News home page

రవాణా సౌకర్యాలతోనే అభివృద్ధి

Apr 29 2026 8:30 AM | Updated on Apr 29 2026 8:30 AM

ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి

ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి

చేగుంట(తూప్రాన్‌): రవాణా సౌకర్యాలతోనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. మండలంలోని జైత్రం తండాలో రూ1.93 లక్షల నిధులతో బీఈ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయంలో దుబ్బాక నియోజవర్గంలో అనేక గ్రామాలకు బీటీ రోడ్లు నిర్మించినట్లు తెలిపారు. రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, విద్యుత్‌ వంటి మౌలిక వసతుల ద్వారానే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ ధరావత్‌ సుభాష్‌నాయక్‌, బి.కొండాపూర్‌ సర్పంచ్‌ రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement