ఆరోగ్య సమాజాన్ని నిర్మిద్దాం | - | Sakshi
Sakshi News home page

ఆరోగ్య సమాజాన్ని నిర్మిద్దాం

Apr 29 2026 8:30 AM | Updated on Apr 29 2026 8:30 AM

● బాల్య వివాహాలు నివారిద్దాం ● అదనపు కలెక్టర్‌ నగేశ్‌

మెదక్‌ కలెక్టరేట్‌: బాల్య వివాహాలు నివారిద్దామని, ఆరోగ్య సమాజాన్ని నిర్మిద్దామని అదనపు కలెక్టర్‌ నగేశ్‌ పిలుపునిచ్చారు. ప్రగతి ప్రణాళికలో భాగంగా మంగళవారం సాయంత్రం మెదక్‌ లోని రాందాస్‌ చౌరస్తాలో మానవహారం చేపట్టారు. మహిళా, శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి అదనపు కలెక్టర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ బాలికల సంరక్షణ కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు, చట్టాలు, హక్కులు కల్పించిందని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం బాల్యవివాహాలను నివారిద్దామంటూ ప్రతిజ్ఞ చేశారు. బాల్య వివాహాల వల్ల కలిగే నష్టాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి హేమ భార్గవి, డీఎఫ్‌ఓ జోజి, డీటీఓ వెంకటస్వామి, డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ శ్రీరామ్‌, డీఈఓ విజయ, మెదక్‌ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ రాధిక తదితరులు పాల్గొన్నారు.

బాల్య వివాహాలు చట్టరీత్యా నేరం: డీఆర్‌డీఓ

నర్సాపూర్‌: బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని డీఆర్‌డీఓ శ్రీనివాస్‌రావు చెప్పారు. మంగళవారం స్థానిక ఐసీడీఎస్‌ ప్రాజెక్టు ఆధ్వర్యంలో స్థానిక పిల్లల పార్కులో విద్యార్థులతో మానవహారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడీడు పిల్లలు బడిలోనే ఉండాలని, చిన్న వయస్సులో వివాహాలు చేస్తే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని వివరించారు. సీఐ జాన్‌రెడ్డి మాట్లాడుతూ డ్రగ్స్‌ రహిత సమాజమే ధ్యేయమన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఐ రంజిత్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ లక్ష్మి, ఇన్‌చార్జి ఎంపీడీఓ మౌజం హుస్సేన్‌, పీహెచ్‌సీ మెడికల్‌ ఆఫీసర్‌ రఘువరన్‌, ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్లు శివకుమారి, సంతోషిమాత, మెహత తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement