టీజీఐఐసీ చైర్‌పర్సన్ నిర్మలారెడ్డి
సంగారెడ్డి: కాంగ్రెస్ పార్టీకి వెన్నెముక దాని అనుబంధ విభాగమైన సేవాదళ్ అని టీజీఐఐసీ చైర్‌పర్సన్ నిర్మలారెడ్డి తెలిపారు. నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో మంగళవారం సేవాదళ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమర్థ శిక్షణ శిబిరానికి టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్‌గౌడ్‌తో కలసి ఆమె హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సేవాదళ్ కార్యకర్తలు కీలకపాత్ర పోషిస్తున్నారన్నారు. అనంతరం మహేశ్‌కుమార్‌గౌడ్ మాట్లాడుతూ...రాబోయే రాజకీయ సవాళ్లను ఎదుర్కోవడానికి, పార్టీ సంస్థాగత బలో పేతానికి తీసుకోవాల్సిన చర్యలపై ఈ శిక్షణ శిబిరంలో చర్చించడం మంచి పరిణామమన్నారు. ప్రభు త్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సేవాదళ్ కార్యకర్తలు కీలక పాత్ర పోషించాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షులతోపాటు, పలువురు సీనియర్ నాయకులు, రాష్ట్రవ్యాప్తంగా సేవాదళ్ కార్యకర్తలు పాల్గొన్నారు.


