మధ్యలోనే వెనుదిరిగిన ఇరిగేషన్ అధికారులు
జిన్నారం (పటాన్‌చెరు): గడ్డపోతారం పట్టణ పరిధిలోని ధర్మి చెరువును గ్రామస్తుల ఫిర్యాదుల మేరకు మంగళవారం ఇరిగేషన్, కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) అధికారులు సందర్శించారు. ఇటీవల గడ్డపోతారం అయ్యమ్మ చెరువు అలుగు తొలగించడంతో కాజిపల్లి ధర్మి చెరువులోకి రసాయన వ్యర్థాలు చేరుకున్నాయని అధికారులకు ఫిర్యాదులు చేశారు. చెరువును సందర్శించేందుకు వచ్చిన ఇరిగేషన్ డీఈ రామస్వామి, ఏఈ చక్రవర్తి, పీసీబీ ఏఈ రవీందర్‌తో కలిసి సంయుక్తంగా సందర్శనకు వచ్చారు. గ్రామస్తులు ఇరిగేషన్ అధికారులకు సమాచారం లేకుండా అలుగును తొలగించడమేంటని ప్రశ్నించే క్రమంలో అధికారులు మధ్యలోనే వెళ్లియారు. దీంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, పీసీబీ అధికారులు చెరువులోని శాంపిళ్లను సేకరించారు. నివేదిక అనంతరం బాధ్యులైన పరిశ్రమలపై చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కౌన్సిలర్ ఇంద్రసేన, మాజీ ఉపసర్పంచ్ ఆంజనేయులు, మాజీ కో ఆప్షన్ సభ్యులు వాహబ్ తదితరులు పాల్గొన్నారు.


