అండర్‌పాస్‌ వంతెన నిర్మాణానికి కృషి | - | Sakshi
Sakshi News home page

అండర్‌పాస్‌ వంతెన నిర్మాణానికి కృషి

Apr 29 2026 8:30 AM | Updated on Apr 29 2026 8:30 AM

ఎంపీ రఘునందన్‌రావు

ఎంపీ రఘునందన్‌రావు

చిన్నశంకరంపేట(మెదక్‌): నార్సింగి మండల కేంద్రం నుంచి శాలిపేట గ్రామానికి వెళ్లే రహదారిపై రైల్వేట్రాక్‌ వద్ద అండర్‌పాస్‌ బ్రిడ్జి నిర్మాణం కోసం కృషిచేస్తానని ఎంపీ రఘునందన్‌రావు అన్నారు. నార్సింగి సర్పంచ్‌ సుజాతగౌడ్‌తోపాటు మరో ఎనిమిది గ్రామాల సర్పంచ్‌ల కోరిక మేరకు వంతెన నిర్మాణానికి మంగళవారం స్థలాన్ని పరిశీలించారు. ఆయన రైల్వే డీఆర్‌ఎంతో ఫోన్‌లో మాట్లాడి ప్రతిపాదిత వంతెన గురించి వివరించారు. దానికి ఆయన ఒకటి రెండు రోజుల్లో రైల్వే టెక్నికల్‌ టీమ్‌ను పంపించి బ్రిడ్జి నిర్మాణానికి నివేదిక రూపొందిస్తామని చెప్పారు. జాతీయ రహదారిపై నిర్మిస్తున్న బ్రిడ్జి గురించి, లైట్ల ఏర్పాటుపై నేషనల్‌ హైవే అథారిటీ అధికారితో ఫోన్‌లో మాట్లాడారు. తక్షణం లైటింగ్‌ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఎంపీ వెంట నార్సింగి సర్పంచ్‌ సుజాతగౌడ్‌, శాలిపేట, మడూర్‌ సర్పంచ్‌లు నారాయణ, దివ్యగౌడ్‌, ఉప సర్పంచ్‌లు రాజేందర్‌రెడ్డి, కిష్టయ్య, బీజేపీ మండల అధ్యక్షుడు చంద్రశేఖర్‌, బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు బాబు, మాజీ జెడ్పీటీసీ కృష్ణారెడ్డి, మాజీ వైస్‌ ఎంపీపీ మల్లేశంగౌడ్‌, బీజేపీ నాయకులు సత్యపాల్‌రెడ్డి, లింగారెడ్డి, నర్సింహులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement