పెద్దశంకరంపేట(మెదక్): పేదల సొంతింటి కల కాంగ్రెస్‌తోనే సాధ్యమని నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి అన్నారు. సోమవారం మండల పరిధిలోని రామోజిపల్లిలో ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించి మాట్లాడారు. ప్రభుత్వం పేదలకు సొంత గూడును కల్పించాలనే లక్ష్యంతో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించిందన్నారు. ప్రజలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ జయశీల, నాయకులు నారాగౌడ్, సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు పెరుమాండ్లుగౌడ్, సంగమేశ్వర్, రమేశ్‌బాబు, మాజీ ఎంపీపీ రాజు, అనంతరావు, రాంచందర్, సాయిలు, శ్రీనివాస్ పాల్గొన్నారు.
ఉద్యమంలో కళాకారుల పాత్ర గొప్పది
చిన్నశంకరంపేట(మెదక్): తెలంగాణ ఉద్యమంలో కళాకారులు కీలక పాత్ర పోషించారని రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్‌పర్సన్ వెన్నెల అన్నారు. సోమవారం మండల కేంద్రం మీదు గా మెదక్ వెళ్తూ కొద్ది సేపు ఇక్కడ ఆగారు. ఈసందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తలు సన్మానించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తె లంగాణ ఉద్యమంలో తమ ఆట, పాట ద్వారా ప్రజలను కళాకారులు జాగృతం చేశారని కొనియాడారు. కార్యక్రమంలో సర్పంచ్‌ల ఫోరం మండల అధ్యక్షుడు మోహన్‌నాయక్, అంబేద్కర్ సంఘం జిల్లా అధ్యక్షుడు రామచంద్రం,కాంగ్రెస్ నాయకులు రాజ్‌కుమార్, సాయిలు, స్వామి, సత్యం తదితరులు పాల్గొన్నారు.
‘నీట్’కు ఏర్పాట్లు చేయండి
మెదక్ కలెక్టరేట్: మే 3వ తేదీన జరిగే యూజీసీ– నీట్ పరీక్షకు సంబంధించి జిల్లాలో ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ప్రతిమాసింగ్ అధికారులకు ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో వివిధశాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. పరీక్ష కేంద్రాల్లో తాగునీరు, నిరంతర విద్యుత్, శానిటేషన్, తరగతి గదుల శుభ్రత, బెంచీలు, బస్ సదుపాయం వంటి మౌలిక సదుపాయాలన్నీ ఈనెల 30 లోపు పూర్తి చేయాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ నగేశ్, జెడ్పీ సీఈఓ ఎల్లయ్య, డీఆర్డీఓ పీడీ శ్రీనివాసరావు, నీట్ కో ఆర్డినేటర్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.
పైరవీలకు తావు లేదు
మెదక్‌జోన్: ప్రజా సమస్యల పరిష్కారానికే ప్ర జావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. సోమవారం ఎస్పీ కార్యాలయంలో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించి వారితో నేరుగా మాట్లాడారు. తక్షణమే సమస్యలు పరిష్కరించే విధంగా చర్యలు చేప ట్టాలని, సంబంధిత పోలీస్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పోలీస్‌శాఖ ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటుందని, ఎలాంటి పైరవీలకు తావు లేదన్నారు. నేరుగా పోలీస్ అధికారులను సంప్రదించాలని సూచించారు. చట్టపరమైన మార్గంలో ప్రతి ఒక్కరికీ న్యాయం అందించడమే పోలీస్‌శాఖ ప్రధాన బాధ్యత అని స్పష్టం చేశారు.


