బంకుల్లో బారులు | - | Sakshi
Sakshi News home page

బంకుల్లో బారులు

Apr 28 2026 8:52 AM | Updated on Apr 28 2026 8:52 AM

మంగళవారం శ్రీ 28 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 2026

మంగళవారం శ్రీ 28 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 2026

జిల్లాలో మళ్లీ పెట్రోల్‌, డీజిల్‌ కొరత ఏర్పడింది. సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వాహనదారులు బంకుల వద్ద బారులు తీరారు. కొందరు ముందు జాగ్రత్తగా డబ్బాల్లో నింపుకొన్నారు. వరికోతల వేళ డీజిల్‌ కొరత ఏర్పడడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. చర్లపల్లి ఐఓసీ నుంచి జిల్లాకు డీజిల్‌ సరఫరా అవుతుంది. అక్కడ నిల్వలు లేకపోవడంతో సమస్య ఏర్పడింది. ఈ విషయమై కలెక్టర్‌ డీలర్లలో గూగుల్‌మీట్‌ నిర్వహించారు. మంగళవారం సాయంత్రంలోగా సమస్య తీరుతుందని జిల్లా సివిల్‌ సప్లై అధికారి నిత్యానంద్‌ తెలిపారు.

– నర్సాపూర్‌/ మెదక్‌కలెక్టరేట్‌

Advertisement
 
Advertisement
Advertisement