హస్తానికే ‘కో ఆప్షన్‌’ | - | Sakshi
Sakshi News home page

హస్తానికే ‘కో ఆప్షన్‌’

Apr 28 2026 8:46 AM | Updated on Apr 28 2026 8:46 AM

● ఏకగ్రీవంగా ఎన్నిక ● గైర్హాజరైన బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లు

● ఏకగ్రీవంగా ఎన్నిక ● గైర్హాజరైన బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లు

మెదక్‌ కలెక్టరేట్‌: కో ఆప్షన్‌ స్థానాలు ఊహించినట్లుగానే హస్తం ఖాతాలో చేరాయి. సోమవారం నిర్వహించిన ఎన్నికలో కాంగ్రెస్‌ నుంచి నామినేషన్‌ వేసిన కొర్వి రాములు, రాగి వనజ, తాహెర్‌అలీ, అనూష ఏకపక్ష విజయాన్ని సొంతం చేసుకున్నారు. మెజార్టీ కౌన్సిల్‌ సభ్యులు ఉండటంతో ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు మున్సిపల్‌ కమిషనర్‌ శ్రీనివాస్‌రెడ్డి ప్రకటించారు. అనంతరం వారితో ప్రమాణ స్వీకారం చేయించారు. కాగా బీఆర్‌ఎస్‌కు చెందిన కొంతమంది కౌన్సిలర్లు ఇటీవలే కాంగ్రెస్‌లో చేరగా, మరికొందరు సమావేశానికి గైర్హాజరయ్యారు. నామినేషన్‌ వేసిన సభ్యులు సైతం హాజరుకాకపోవడం గమనార్హం. ఈసందర్భంగా ఎమ్మెల్యే రోహిత్‌రావు, మాజీ ఎమ్మెల్యే హన్మంతరావు నూతనంగా ఎన్నికై న వారిని సన్మానించి అభినందించారు. అనంతరం మున్సిపల్‌ కౌన్సిల్‌ సమావేశం నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే రెండు కొత్త వాటర్‌ ట్యాంకర్లను ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వేసవిని దృష్టిలో పెట్టుకొని నియోజకవర్గంలో తాగునీటి ఎద్దడి నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు తెలిపారు. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ రాధిక, వైస్‌ చైర్మన్‌ నరేశ్‌గౌడ్‌ల అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ఎమ్మెల్యే రోహిత్‌రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ రాధిక, వైస్‌ చైర్మన్‌ నరేశ్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement