కలెక్టర్ ప్రతిమాసింగ్
మెదక్ కలెక్టరేట్: దేశం కోసం బాబు జగ్జీవన్‌రామ్ చేసిన సేవలు మరువలేనివని కలెక్టర్ ప్రతిమాసింగ్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని నర్సాపూర్ చౌరస్తాలో నిర్వహించిన జగ్జీవన్‌రామ్ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జగ్జీవన్‌రామ్ దేశ నిర్మాణంలో కీలకపాత్ర పోషించిన మహానేత అని కొనియాడారు. సామాజిక న్యాయం, సమానత్వం కోసం ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని అన్నారు. దళితుల అభ్యున్నతి కోసం ఆయన చేసిన త్యాగా లు, సేవలు దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేశ్, మున్సిపల్ చైర్‌పర్సన్ రాధిక, ఉత్సవ కమిటీ చైర్మన్ సంజీవ్, వైస్ చైర్మన్ శ్రీనివాస్, వివిధ సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
పారదర్శకంగా బియ్యం పంపిణీ
మూడు నెలల రేషన్ బియ్యం పంపిణీలో పారదర్శకత పాటించాలని కలెక్టర్ ప్రతిమాసింగ్ నిర్వాహకులకు సూచించారు. ఆదివారం పట్టణంలోని పలు రేషన్ దుకాణాలను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులు పరిశీలించారు. బియ్యం లబ్ధిదారులకు చేరేలా పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఆమె వెంట సిబ్బంది ఉన్నారు.


