ఎమ్మెల్యే సునీతారెడ్డి
నర్సాపూర్: రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం అయిందని ఎమ్మెల్యే సునీతారెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో ఆరోపించారు. గజ్వేల్‌లోని మాజీ సీఎం కేసీఆర్ క్యాంపు కార్యాలయంపై కాంగ్రెస్ నాయకుల దాడిని ఆమె తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇలాంటి ఘటనలు అత్యంత దురదృష్టకరమన్నారు. ప్రజల సమస్యలు తెలుసుకునే ప్రదే శాలపై దాడులు జరగడం సరికాదన్నారు. పదేళ్లు రాష్ట్రాన్ని పరిపాలించిన మాజీ సీఎం కేసీఆర్ క్యాంపు కార్యాలయానికే రక్షణ లేకపోవడంపై విచారం వ్యక్తం చేశారు. పోలీసులు వెంటనే స్పందించి దాడి చేసిన వారిపై కేసులు నమోదు చేసి, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసు కోవాలని డిమాండ్ చేశారు.


