పీసీసీఎఫ్ రత్నాకర్
రామాయంపేట(మెదక్): మండలంలోని అక్కన్నపేట అటవీప్రాంతంలో నిర్మిస్తున్న నగర వన యోజన పార్కు నిర్మాణ పనులను ఆదివారం రాష్ట్ర అటవీశాఖ ప్రధాన సంరక్షణ అధికారి (పీసీసీఎఫ్) రత్నాకర్, చీఫ్ కన్జర్వేటర్ అధికారిణి అపర్ణ పరిశీలించారు. పార్క్‌లో కొనసాగుతున్న వాచ్‌టవర్, పగోడ, వన మూలికల మొక్కలు, ఇతర నిర్మాణాలను పరిశీలించి పలు సూచనలు చేశారు. నెలలోపు నిర్మాణ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. సఫారి నిర్మాణానికి సంబంధించి నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. పనులు నాణ్యతగా ఉండాలని సూచించారు. నిర్మాణాలకు సంబంధించి మ్యాపును చూశారు. అనంతరం జిల్లా అటవీశాఖ అధికారి జోజితో కలిసి వాచ్‌టవర్ పైకి ఎక్కి అటవీ అందాలను వీక్షించారు. వారి వెంట రేంజ్ అధికారి విద్యాసాగర్, డిప్యూటీ రేంజ్ అధికారులు శ్రీనివాస్, గీత, బీట్ అధికారి లక్ష్మణ్ ఉన్నారు.


