‘రాత్రి 11 లోపు దుకాణాలు మూసివేయాలి’ | - | Sakshi
Sakshi News home page

‘రాత్రి 11 లోపు దుకాణాలు మూసివేయాలి’

Apr 6 2026 8:36 AM | Updated on Apr 6 2026 8:36 AM

మెదక్‌జోన్‌: శాంతిభద్రతల పరిరక్షణ నేపథ్యంలో రాత్రి 11 గంటలలోపు డివిజన్‌ పరిధిలోని అన్ని దుకాణాలు, వ్యాపార సంస్థలను మూసివేయాలని మెదక్‌ డీఎస్పీ ప్రసన్నకుమార్‌ తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. భద్రతాపరమైన అంశాలను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. రాత్రి 11 గంటల అనంతరం ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తామన్నారు. ఆ సమయంలో తెరిచి ఉన్న దుకాణాలు, ఇతర వాణిజ్య సంస్థలపై శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేస్తామన్నారు.

ఉపాధి కల్పనే లక్ష్యంగా జాబ్‌మేళా

నర్సాపూర్‌: యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నానని, అందులో భాగంగానే జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు కాంగ్రెస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి ఆవుల రాజిరెడ్డి చెప్పారు. ఆదివారం పట్టణంలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో ఏర్పాటు చేసిన జాబ్‌మేళా కార్యక్రమంలో పాల్గొని ఉద్యోగాలు పొందిన వారికి నియామకపత్రాలు అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జాబ్‌ మేళా కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతుందన్నారు. 200 మందికి ఉద్యోగ అవకాశం లభించిందని, మరో 150 మందికి త్వరలో ఉద్యోగాలు లభిస్తాయని తెలిపారు. కార్యక్రమంలో ప్యాక్స్‌ మాజీ చైర్మన్‌ రాజుయాదవ్‌, నవీన్‌గుప్తా, తరుణ్‌, సందీప్‌, మణిదీప్‌, హర్షవర్దన్‌ తదితరులు పాల్గొన్నారు.

వర్సిటీల్లో ఖాళీలు

భర్తీ చేయండి

మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి

పాపన్నపేట(మెదక్‌): విశ్వ విద్యాలయాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయాలని కోరుతూ సీఎం రేవంత్‌రెడ్డికి బహిరంగ లేఖ రాసినట్లు మెదక్‌ మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. ఖాళీలు భర్తీ చేయకుండా కేవలం అభివృద్ధి ప్రణాళికను ముందుకు తీసుకురావడం శోచనీయమన్నా రు. మేనిఫెస్టోలో విద్య, వైద్యానికి ప్రాఽ దాన్యం ఇస్తున్నామని ప్రభుత్వం ప్రకటిస్తున్నప్పటికీ, తీరా బడ్జెట్‌ కేటాయింపుల్లో అది కనిపించడం లేదన్నారు. యూనివర్సిటీల్లో 72 శాతం ఖాళీ లు ఉన్నాయన్నారు. ఇప్పటికై నా ఓయూతో పాటు రాష్ట్రంలోని ఇతర వర్సిటీల్లో ఖాళీలను భర్తీ చేయాలని కోరారు.

దరఖాస్తుల ఆహ్వానం

నర్సాపూర్‌రూరల్‌: ‘నీట్‌’ శిక్షణ కోసం విద్యార్థులు ఆన్‌లైన్‌ ద్వారా ఈనెల 15వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని చిప్పల్‌తుర్తి కేజీబీవీ స్పెషల్‌ ఆఫీసర్‌ శ్వేత ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈఏడాది ఇంటర్మీడియెట్‌ నీట్‌ ప్రారంభం కానున్నట్లు తెలిపారు. మే 3న అర్హత పరీక్ష ఉంటుందన్నారు.

పేట నియోజకవర్గ

పునరుద్ధరణకు కృషి చేయండి

రామాయంపేట(మెదక్‌): రామాయంపేట అసెంబ్లీ నియోజకవర్గం పునరుద్ధరించేలా కృషి చేయాలని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ గజవాడ లావణ్య ఎంపీ రఘునందన్‌రావును కలిసి విజ్ఞప్తి చేశారు. ఈమేరకు ఆమె పలువురు కౌన్సిలర్లతో కలిసి ఆదివారం ఎంపీని హైదరాబాద్‌లోని ఆయన స్వగృహంలో కలిసి వినతిపత్రం అందజేశారు. రామాయంపేట నియోజవర్గ కేంద్రంగా ఏర్పాటైతేనే అభివృద్ది సాధ్యపడుతుందని, ఈదిశగా కృషి చేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు. తన వంతు ప్రయత్నం చేస్తానని ఎంపీ హామీ ఇచ్చారు. ఆమె వెంట కౌ న్సిలర్లు నాగరాజు, రవి, రంజిత్‌, కాంగ్రెస్‌ పట్టణాధ్యక్షుడు చింతల స్వామి, జిల్లా కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు యాదగిరి, నాయకులు దేమె యాదగిరి, గణేశ్‌, డాకి స్వామి, బైరం కుమార్‌, సాయితేజ, సుధీర్‌గౌడ్‌ ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement