దుబ్బాక: కేసీఆర్ లేకుంటే రాష్ట్రం వచ్చేదా.. రేవంత్‌రెడ్డి సీఎం అయ్యేవారా .. అసలు కేసీఆర్‌తో రేవంత్‌కు పోలికే లేదని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. ఆదివారం దుబ్బాకలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అభద్రతా భావంలో ఉందన్నారు. ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను కప్పి పుచ్చుకునేందుకే కాంగ్రెస్ డైవర్షన్ రాజకీయాలు చేస్తోందన్నారు. కాంగ్రెస్ నాయకులు అరాచకాలు ఎక్కువయ్యాయని విమర్శించారు. గజ్వేల్‌లో క్యాంపు కార్యాలయంపై దాడిచేసిన కాంగ్రెస్ నాయకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
చెరువులను సుందరంగా తీర్చిదిద్దాలి
చెరువులను సందరంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. చెరువుల సందరీకరణపై ఐఓసీలో పవర్ పాయింట్ ప్రజంటేషన్ ను వీక్షించారు. అమృత్ పథకంలో దుబ్బాక పట్టణంలోని పెద్ద చెరువు, రామసముద్రం, ఏదుల్ల చెరువుల సుందరీకరణకు రూ.5 కోట్లు మంజూరు అయ్యాయన్నారు. నిధులతో చెరువులను సుందరంగా తీర్చి దిద్ది, పర్యాటకులను ఆకట్టుకునేలా నిర్మాణాలు చేపట్టాలన్నారు.
ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి


