నర్సాపూర్: ప్రజలను మభ్యపెట్టే విధంగా రాష్ట్ర బడ్జెట్ ఉందని ఎమ్మెల్యే సునీతారెడ్డి ఆరోపించారు. శుక్రవారం పట్టణంలో విలేకరులతో మాట్లాడుతూ.. బడ్జెట్‌తో ప్రజలకు ఒరిగిందేమి లేదన్నారు. ఎన్నికలప్పుడు కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలను వంద రోజుల్లో అమలు చేస్తామని ఇప్పటివరకు పూర్తిస్థాయిలో అమలు చేయలేదన్నారు. ఇప్పటి వరకు మూడుసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ప్రభుత్వం ఆరు గ్యారంటీలకు నిధులు కేటాయించలేదన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎమ్మెల్యేలకు నిధులు సైతం ప్రభుత్వం కేటాయించడం లేదని మండిపడ్డారు. కాంగ్రెస్ నాయకులవి మాటలే తప్ప చేతల్లో ఏమి ఉండటం లేదన్నారు. ఇప్పటికై నా ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. సమావేశంలో బీఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.
గజ్వేల్ మున్సిపాలిటీకి
రూ.89 లక్షల ఆదాయం
గజ్వేల్: మున్సిపాలిటీకి తెబజార్, పశువుల సంత వేలం ద్వారా రూ.89లక్షల ఆదాయం సమకూరింది. శుక్రవారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో చైర్‌పర్సన్ గంగిశెట్టి చందన, కమిషనర్ వెంకటగోపాల్ ఆధ్వర్యంలో ముందుగా తైబజార్ వేలం జరిగింది. ఇందులో 21మంది పాల్గొనగా..ఈ భిక్షపతి అత్యధికంగా రూ.70లక్షలు పాట పాడి దక్కించుకున్నారు.


