నాడు సర్పంచ్‌లు..నేడు వార్డు సభ్యులు
చిన్నశంకరంపేట(మెదక్): మండల పరిధిలోని కా మారంలో గతంలో సర్పంచ్‌లుగా పనిచేసిన భార్యాభర్తలు తాజాగా జరిగిన ఎన్నికల్లో వార్డు సభ్యులుగా గెలుపొందారు. కామారం సర్పంచ్‌గా పనిచేసిన గడీల సుధాకర్, హేమలత తాజా ఎన్నికల్లో 3, 8వ వార్డులలో పోటీ చేసి గెలిచారు. సర్పంచ్ ఎస్సీకి రిజర్వు కావడంతో వీరు వార్డు సభ్యులుగా పోటీ చేసి గెలిచారు. కాగా వార్డు సభ్యుడిగా గెలిచిన సుధాకర్ ఉపసర్పంచ్‌గా ఎన్నికయ్యారు.
దంపతుల ధమాకా
మనోహరాబాద్(తూప్రాన్): మండలంలోని కాళ్లకల్, దండుపల్లి గ్రామాల్లో భార్యాభర్తలు వార్డు సభ్యులుగా బరిలో నిలిచి విజయం సాధించారు. కాళ్లకల్ 6వ వార్డులో భర్త వీరబోయిన ప్రవీణ్ డ్రాలో గెలిచారు. 7వ వార్డులో ఆయన భార్య మమత 129 ఓట్ల మెజార్టీతో గెలుపొందింది. దండుపల్లి 1వ వార్డులో భర్త కోనేరు సురేశ్‌కుమార్, 7వ వార్డులో భార్య మనీషా విజయం సాధించారు.
సురేశ్‌కుమార్, మనీషా
ప్రవీణ్, మమత
నాడు సర్పంచ్‌లు..నేడు వార్డు సభ్యులు
నాడు సర్పంచ్‌లు..నేడు వార్డు సభ్యులు


