మద్యం, నగదు పంపిణీకి రంగం సిద్ధం
కాగా మూడవదశ ఎన్నికల ప్రచారానికి సోమవారంతో గడువు ముగియడంతో ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే ప్రయత్నాలు చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. తమకు నమ్మకం ఉన్న ఓటర్లకు నగదు, మద్యం పంపిణీ చేసేందుకు ఆయా సర్పంచ్ అభ్యర్థులు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. పథకం ప్రకారం ఎవరికీ అనుమానం రాకుండా నగదు, మద్యం పంపిణీ చేసేందుకు రాత్రివేళలను ఎంచుకుంటున్నారు. అయితే పోటీ చేస్తున్న అభ్యర్థులంతా ఇదే ఎత్తుగడ వేస్తుండడంతో గ్రామాలన్నీ మద్యం మత్తులో ఊగిపోతున్నాయి. నగదు విషయంలో కూడా నైతిక విలువలు దిగజారే ప్రమాదం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.


