అందరికీ ఆరోగ్య సేవలు అందాలి
జూనియర్ సివిల్ జడ్జి తేజశ్రీ
మెదక్ కలెక్టరేట్: ప్రతి మనిషికి ఆరోగ్య సేవలు అందాలని, అందుకు వైద్యులు కృషి చేయాలని జూనియర్ సివిల్ జడ్జి తేజశ్రీ అన్నారు. శుక్రవారం మెదక్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో న్యాయవిజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈసందర్భంగా జడ్జి మాట్లాడుతూ.. ప్రతి మనిషికి ఆరోగ్య సేవలు అందుబాటులో ఉండాలని, డబ్బు లేకపోవడం వల్ల ఎ వరూ చికిత్సకు దూరం కావొద్దన్నారు. ప్రతి కుటుంబం అవసరమైన సమయానికి తక్కువ ఖర్చుతో మెరుగైన వైద్యం పొందే హక్కు కలిగి ఉంటుందన్నారు. ప్రతి ఒక్కరికీ సమానమైన ఆరోగ్య హక్కు లభించేలా అందరూ అవగాహన పెంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఆస్పత్రి సూపరింటెండెంట్ సునీతాదేవి, ప్యానల్ లాయర్ కరుణాకర్, అసిస్టెంట్ ల్యాడ్స్ నాగరాజు, వైద్యులు తదితరులు పాల్గొన్నారు.


