గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ దగా
నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి
వెల్దుర్తి(తూప్రాన్): కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీల పేరుతో గద్దెనెక్కి హామీల అమలును పూర్తిగా విస్మరించిందని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి అన్నారు. గురువారం ఉమ్మడి వెల్దుర్తి మండలంలోని పలు గ్రామాల్లో బీఆర్‌ఎస్ బలపరిచిన సర్పంచ్, వార్డు సభ్యు లకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల అమలులో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విమర్శించారు. బీఆర్‌ఎస్ హయాంలో అన్నివర్గాల వారికి సంక్షేమ పథకాలు అందాయని వివరించారు. ప్రజా సమస్యలపై నిత్యం ఆలోచించే బీఆర్‌ఎస్ బలపరిచిన అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు భూపాల్‌రెడ్డి, మాజీ జెడ్పీటీసీ రమేశ్‌గౌడ్, నాయకులు నర్సింలు, సోమప్ప, వెంకటేశం, చల్ల పద్మ, శేఖర్, నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.


