హక్కులకు భంగం కలిగిస్తే చర్యలు
జూనియర్ సివిల్ జడ్జి హేమలత
నర్సాపూర్ రూరల్: మానవ హక్కులకు భంగం కలిగిస్తే బాధ్యులపై చట్టరీత్యా చర్యలు తప్పవని జూనియర్ సివిల్ కోర్టు జడ్జి హేమలత అన్నారు. బుధవారం అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవా న్ని పురస్కరించుకొని కోర్టు ఆవరణలో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అన్నివర్గాల ప్రజలు భారత రాజ్యా ంగాన్ని సద్వినియోగం చేసుకొని, అందులో పొందుపరచిన హక్కులు, చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. 18 ఏళ్ల లోపు బాలికలకు వివాహం చేస్తే చట్ట ప్రకారం ఇరు కుటుంబాలపై చర్యలు ఉంటాయన్నారు. బాల్య వివాహాల నిర్మూలనకు అందరూ సహకరిస్తే మంచి సమాజం నిర్మాణం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ సహాయ న్యాయవాది సుధాకర్, కౌన్సిల్ న్యాయవాది స్వరూపరాణి, లోక్ అదాలత్ బెంచ్ సభ్యులు మధుశ్రీ శర్మ, న్యాయవాదులు నాగరాజు, సాయిరాం, రవినాయక్, సూపరింటెండెంట్ సూర్య ప్రకాశ్, లీగల్ సర్వీస్ సిబ్బంది పాల్గొన్నారు.


