గ్రామాల స్వరూపం మారుస్తాం
పాపన్నపేట(మెదక్): కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపిస్తే, గ్రామాల స్వరూపాలను మార్చేస్తామని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ అన్నారు. సోమవారం మండల పరిధిలోని పలు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మా ట్లాడుతూ.. నిరుపేదలకు సన్న బియ్యం, ఇందిరమ్మ ఇళ్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయా ణం, బతుకమ్మ చీరలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆదరించాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు ప్రభాకర్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, గోవింద్ నాయక్, సర్పంచ్ అభ్యర్థులు పాల్గొన్నారు.
అన్ని రంగాల్లో అభివృద్ధి
పెద్దశంకరంపేట(మెదక్): అవినీతి రహిత పాలనే కాంగ్రెస్ లక్ష్యమని నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి అన్నారు. సోమవారం పెద్దశంకరంపేట పట్టణ సర్పంచ్ అభ్యర్థి చంద్రమురళి తరుఫున ప్రచారం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మండల కేంద్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రణాళికను రూపొందిస్తున్నామని తెలిపారు. గతంలో పంచాయ తీలో నకిలీ రశీదు లు ఇచ్చి ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టారని విమర్శించారు. త్వరలో 30 పడకల ఆస్పత్రి మంజూరుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పా రు. సీసీ రోడ్లు, డ్రైనేజీలు, విద్యుత్ సమస్య పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో సురేందర్‌రెడ్డి, మధు, నారాగౌడ్, వేణుగోపాల్‌గౌడ్, సుభాశ్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
గ్రామాల స్వరూపం మారుస్తాం


