డీసీసీ చీఫ్‌లకు పరీక్ష! | - | Sakshi
Sakshi News home page

డీసీసీ చీఫ్‌లకు పరీక్ష!

Dec 6 2025 8:48 AM | Updated on Dec 6 2025 8:48 AM

డీసీసీ చీఫ్‌లకు పరీక్ష!

డీసీసీ చీఫ్‌లకు పరీక్ష!

గ్రామ పంచాయతీల్లో వంద శాతం కాంగ్రెస్‌ పార్టీ బలపరిచిన అభ్యర్థులే గెలిచేలా కృషి చేయాలని అధిష్టానం ఆదేశించినట్లు సమాచారం. ఇటీవల సమావేశంలో ఈ ఆరు నెలలు డీసీసీ చీఫ్‌ల పనితీరుపై నివేదిక తీసుకుని దాని ప్రకారం ఎవరిని ఉంచాలో ఎవరిని తీసేయాలో పార్టీ నిర్ణయం తీసుకోనుందని సీఎం రేవంత్‌రెడ్డి ఇదివరకే స్పష్టం చేశారు. డీసీసీ అధ్యక్షుల నియామకం తర్వాత గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. డీసీసీ అ ధ్యక్షులకు తమ సత్తాను చాటుకునేందుకు ఇదే సరైన సమయం. ఒకే గ్రామ పంచాయతీలో కాంగ్రెస్‌ పార్టీ మద్దతు దారు ఒక్కరే పోటీ చేసేలా.. మిగతా వారిని బుజ్జగించి ఏకతాటిపైకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీ మద్దతు దారులను గెలిపించి పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నారు.

నేతలు సహకరించేనా?

ఉమ్మడి మెదక్‌ జిల్లాలో బీఆర్‌ఎస్‌ పార్టీ బలంగా ఉంది. జిల్లాలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు ముగ్గురు, ఒకరు కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే, బీజేపీ నుంచి ఎంపీ ఉన్నారు. హుస్నాబాద్‌ నుంచి మంత్రి పొన్నం ప్రభాకర్‌ ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ మూడు మండలాలు మాత్రమే సిద్దిపేట జిల్లా పరిధిలో ఉన్నాయి. మిగతా నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌చార్జులు ఉన్నారు. సిద్దిపేట, దుబ్బాక నియోజకవర్గాల్లో ఇన్‌చార్జులను సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాల్సి ఉంది. కానీ ఈ రెండు నియోజకవర్గాల్లో ఇన్‌చార్జులు డీసీసీ అధ్యక్షురాలిని ప్రచారానికి ఆహ్వానిస్తారా? సహకరిస్తారా..? అని పార్టీ జిల్లా నేతల్లో చర్చ సాగుతోంది. డీసీసీ చీఫ్‌ ఆంక్షారెడ్డి సొంత నియోజకవర్గంలో తొలి విడత పంచాయతీ ఎన్నికలు జరుగుతుండటంతో ఇప్పటికే ప్రచారంలో విస్తృతంగా పాల్గొంటూ కాంగ్రెస్‌ పార్టీ బలపరిచిన అభ్యర్థుల గెలుపునకు కృషి చేస్తున్నారు.

గ్రామ పంచాయతీ ఎన్నికల తొలి పరీక్షను జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు ఎదుర్కొంటున్నారు. నవంబర్‌ 22న ఉమ్మడి మెదక్‌ జిల్లాలో సిద్దిపేట డీసీసీ అధ్యక్షురాలిగాతూంకుంట ఆంక్షారెడ్డి, మెదక్‌ జిల్లా డీసీసీ అధ్యక్షుడిగా ఆంజనేయులు గౌడ్‌లను నియమించగా సంగారెడ్డి జిల్లాలోపెండింగ్‌లో పెట్టారు. కొత్తగా నియమితులైన డీసీసీ అధ్యక్షులకు ఆరు నెలల పాటు పనితీరును పరిశీలిస్తామని ఇప్పటికే సీఎం ప్రకటించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రజల తీర్పు ఏ విధంగా ఉంటుందోనని డీసీసీ చీఫ్‌లలో టెన్షన్‌ పట్టుకుంది.

– సాక్షి, సిద్దిపేట

ప్రణాళికతో ముందుకు

కాంగ్రెస్‌ పార్టీ బలపరిచిన అభ్యర్థులు ఎన్నికల్లో గెలుపొందేలా ప్రణాళికతో డీసీసీ అధ్యక్షురాలు తూంకుంట ఆంక్షారెడ్డి ముందుకు సాగుతున్నారు. ఈ నెల 11న గజ్వేల్‌ నియోజకవర్గ పరిధిలో ఐదు మండలాలు, దుబ్బాక ని యోజకవర్గంలో రాయపోలు, దౌల్తాబాద్‌ మండలాల్లో గ్రామపంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ప్రత్యేకంగా మేజర్‌ గ్రామ పంచాయతీలలో ఎక్కువగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. అలాగే కాంగ్రెస్‌ పార్టీ చేపట్టిన ఓటు చోరీ సంతకాల సేకరణ క్యాంపెయిన్‌ సైతం ముందుకు తీసుకెళ్తున్నారు. ఇలా అధిష్టానం దగ్గర మార్కులు కొట్టేసేందుకు ప్రయత్నాలు ముమ్మ రం చేశారు. ఓటర్ల నుంచి ఎలాంటి తీర్పు ఉంటుందో అని డీసీసీ చీఫ్‌లు ఆందోళన చెందుతున్నట్లు విశ్వసనీయ సమాచారం.

‘స్థానిక’ంగా సత్తా చాటే సమయం

పనితీరుపై అధిష్టానం నజర్‌

ఆరు నెలలు ప్రొబేషనరీ కాలం

నియోజకవర్గాల

ఇన్‌చార్జులు సహకరించేనా?

ప్రణాళికతో ముందుకు

సాగుతున్న ఆంక్షారెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement