బెల్ట్ తీస్తా.. కోతులను అరికడతా
రామాయంపేట(మెదక్)/చిన్నశంకరంపేట: తనను గెలిపిస్తే గ్రామంలో బెల్ట్‌షాపులు మూయించడంతో పాటు కోతుల బెదడ నివారిస్తానని మండలంలో ని ప్రగతి ధర్మారం సర్పంచ్ అభ్యర్థి ము స్కుల శ్రీకాంత్‌రెడ్డి గ్రామస్తులకు హామీ ఇచ్చారు. ఈమేరకు బాండ్ పేపర్‌పై వివరాలు రాసి గాంధీ విగ్రహం వద్ద యువకులతో కలిసి విడుదల చేశారు. గ్రామంలో ఇష్టారాజ్యంగా వెలిసిన బెల్ట్‌షాపులతో తరచూ గొడవలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. యువతకు ఉపాధి కల్ప నకు కృషి చేస్తానన్నారు. అలాగే చిన్నశంకరంపేటలో కోతుల బెడద లేకుండా చేస్తానని సర్పంచ్ అభ్యర్థి ఎన్‌ఆర్‌ఐ చంద్రశేఖర్ తెలిపారు. 25 హామీలతో ప్రజలను ఆకర్షించేందుకు ‘చందన్న మే నిఫెస్టో’ పేరుతో కరపత్రం విడుదల చేశారు. ఇందులో ప్రధానంగా ప్రజలు నిత్యం సతమతం అవు తున్న కోతులు, ఊర కుక్కల బెడదను నివారించడంతో పాటు డిగ్రీ, పాలిటెక్నిక్ కళాశాలలు, ఆలయాల అభివృద్ధి, వందశాతం అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, అనాధ పిల్లలకు రూ. 10 వేల డిపాజిట్, పూరి గుడిసెలు లేని గ్రామంగా తీర్చిదిద్దుతానని హామీల వర్షం కురిపించారు.
ఓటర్లకు సర్పంచ్ అభ్యర్థుల హామీలు
బెల్ట్ తీస్తా.. కోతులను అరికడతా


