8 పంచాయతీలు ఏకగ్రీవం
వెల్దుర్తి(తూప్రాన్)/కౌడిపల్లి(నర్సాపూర్): మండలంలోని రెండు గ్రామ పంచాయతీల్లో సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నిక ఏకగ్రీవం కానుంది. చెర్లపల్లి ఎస్టీ(మహిళ)కు కేటాయించగా సర్పంచ్ స్థానానికి అరుణతో పాటు 8 వార్డుల్లో ఒక్కో అభ్యర్థి మాత్రమే నామినేషన్లు వేశారు. శంశిరెడ్డిపల్లి తండా అన్ రిజర్వ్‌డ్ (జనరల్) కాగా సర్పంచ్ పదవికి బానోత్ గణేశ్‌తో పాటు 6 వార్డులకు గాను ఆరుగురు అభ్యర్థుల నామినేషన్లు మాత్రమే వచ్చాయి. దీంతో ఆయా పాలకవర్గాలు ఏకగ్రీవం కానున్నాయి. ఇందుకు సంబంధించి అధికారులు అధికారికంగా ప్రకటించడమే మిగిలింది. మూడో విడత ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఈనెల 17న మండలంలో నిర్వహించే పోలింగ్ రోజున అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. అలాగే కౌడిపల్లి మండలంలో ఆరు గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం కానున్నాయి. శుక్రవారం నామినేషన్లకు చివరి రోజు కా వడంతో కన్నారం, మర్రిచెట్టు తండా, పీర్యాతండా, ధర్మసాగర్ గేట్, హరిచంద్ తండా, కుషన్‌గడ్డ పంచాయతీలకు ఒకటి చొప్పున నామినేషన్లు వచ్చాయి. అధికారులు ధ్రువీకరించాల్సి ఉంది.
అప్రమత్తంగా ఉండాలి:
డీఎంహెచ్‌ఓ
పాపన్నపేట(మెదక్): సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్‌ఓ శ్రీరాం సూచించారు. శుక్రవారం పాపన్నపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించి రోగులను పరామర్శించారు. అనంతరం సిబ్బందితో మాట్లాడారు. శీతాకాలం వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. అనంతరం మ ందులు, స్టాక్ రికార్డులు, అటెండెన్స్ రిజిస్టర్‌ను పరిశీలించారు. ఆయన వెంట అధికారు లు హరిప్రసాద్, నవ్య, అన్వర్, చందర్, రాజశ్రీ, శ్రీనివాస్‌రెడ్డి తదితరులు ఉన్నారు.


