ఎలాంటి పొరపాట్లకు తావివ్వొద్దు
నర్సాపూర్/కౌడిపల్లి/కొల్చారం/శివ్వంపేట: పంచాయతీ ఎన్నికలను ఎలాంటి పొరపాట్లు లేకుండా సజావుగా నిర్వహించాలని ఎన్నికల పరిశీలకురాలు భారతి లక్పతినాయక్ సిబ్బందికి సూచించారు. శుక్రవారం నర్సాపూర్, కౌడిపల్లి, కొల్చారం, శివ్వంపేట మండల కేంద్రాల్లో నామినేషన్ల స్వీకరణను పరిశీలించారు. అభ్యర్థులకు ఇబ్బందులు కలుగకుండా చూడాలన్నారు. నిర్ణీత గడువు లోగా నామినేషన్లు స్వీకరించేందుకు టోకెన్లను జారీ చేయాలని చెప్పారు. అభ్యర్థులకు ఎన్నికల ఖర్చుపై అవగాహన కల్పించాలని, వ్యయ పరిమితిని పక్కాగా లెక్కించేలా తగిన ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించారు. కొత్త బ్యాంక్ అకౌంట్ ద్వారా మాత్రమే ఎన్నికల వ్యయ లావాదేవీలు నిర్వహించాల్సి ఉంటుందన్నారు. ఆమె సంబంధిత ఆర్డీఓలు, ఇతర అధికారులు సిబ్బంది ఉన్నారు.
అబ్జర్వర్ భారతి లక్పతినాయక్


