నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు
కొల్చారం(నర్సాపూర్): ఎన్నికల నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ శ్రీనివాసరావు హెచ్చరిచారు. మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం నామినేషన్ల ప్రక్రియను పరిశీలించారు. కేంద్రాల వద్ద 100 మీటర్ల పరిధిలో నిబంధనలు అమల్లో ఉంటాయని, పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలులో ఉందని తెలిపారు. ఎన్నికల సమయంలో అనవసర గొడవలు, అవాంఛనీయ చర్యలకు పాల్పడే వ్యక్తులపై కఠిన చ ర్యలు తీసుకుంటామన్నారు. ఎస్పీ వెంట ఎస్బీ ఇన్‌స్పెక్టర్ సందీప్‌రెడ్డి, ఎస్‌ఐ మోహినొద్దీన్, సిబ్బంది ఉన్నారు.
బ్యాలెట్ పత్రాల పరిశీలన
హవేళిఘణాపూర్(మెదక్): మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన బ్యాలెట్ పత్రాలను శుక్రవారం మెదక్ ఆర్డీఓ రమాదేవి పరిశీలించారు. మండలంలోని 30 గ్రామాలకు సంబంధించిన బ్యాలెట్ పత్రాల గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. బ్యాలెట్ పేపర్ల ప్రచురణ సరిగా ఉన్నాయో పరిశీలించాలని సూచించారు. ఆమె వెంట తహసీల్దార్ సింధూరేణుక, పంచాయతీ కార్యదర్శులు కవిత, నవనీత, చైతన్య, శారదలు ఉన్నారు.
31 నుంచి అఖిల భారత
మహాసభలు: సీఐటీయూ
మెదక్ కలెక్టరేట్: ఈనెల 31 నుంచి జనవరి 4వ తేదీ వరకు విశాఖపట్నంలో జరిగే సీఐటీయూ అఖిల భారత 18వ మహాసభలను జయప్రదం చేయాలని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్క రాములు పిలుపునిచ్చారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని కేవల్ కిషన్ భవన్ వద్ద సీఐటీయూ జెండాను ఆవిష్కరించి మాట్లాడారు. మహాసభలకు దేశ నలుమూలల నుంచి ప్రతినిధులు హాజరు కానున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైందన్నారు. ఈనెల7, 8, 9 తేదీల్లో మెదక్‌లో జరిగే సీఐటీయూ రాష్ట్ర మహాసభలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లికార్జున్, అడివయ్య, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బాలమణి, మల్లేశం జిల్లా కోశాధికారి నర్సమ్మ, నాయకులు మల్లేశం తదితరులు పాల్గొన్నారు.
కొత్త ఆవిష్కరణలకు బీజం
ముగిసిన వైజ్ఞానిక ప్రదర్శన
మెదక్‌జోన్: విద్యార్థులు విజ్ఞానశాస్త్రాన్ని ఒంట బట్టించుకుని కొత్త ఆవిష్కరణలకు బీజం వేయాలని అదనపు కలెక్టర్ నగేశ్ సూచించారు. పట్టణంలోని వెస్లీ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన ఇన్స్‌ఫెయిర్, సైన్స్‌ఫెయిర్ శుక్రవారంతో ముగిసింది. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు వినూత్నంగా ఆలోచించి కొత్త కొత్త ఆవిష్కరణలను రూపొందించాలన్నారు. ఈసారి విజేతలుగా నిలవని విద్యార్థులందరూ వచ్చే సంవత్సరం ఇదే కార్యక్రమానికి మరింత మెరుగ్గా ప్రాజెక్టులు తీసుకొని రావాలని తెలిపారు. సైన్స్‌ఫెయిర్‌కు 400 పైచిలుకు ఎగ్జిబిట్లు రాగా, సుమారు 50 మంది విజేతలుగా నిలిచారు. వారందరికీ ఆయన సర్టిఫికెట్లు ప్ర దానం చేశారు. ఇందులో రాష్ట్రస్థాయికి 5 ప్రా జెక్టులు ఎంపికై నట్లు జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి పేర్కొన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ మహేందర్, జిల్లా విద్యాశాఖ అధికారి విజయ, జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి, జెడ్పీ సీఈఓ ఎల్లయ్య, డీఆర్‌డీఏ పీడీ శ్రీనివాసరావు, మండల విద్యాధికారులు పాల్గొన్నారు.
నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు
నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు
నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు


