గడువులోగా సీఎంఆర్ అందించాలి
మెదక్ కలెక్టరేట్: సీఎంఆర్ అందించే విషయంలో కొంతమంది మిల్లర్లు అలసత్వం వహిస్తున్నారని, వెంటనే టార్గెట్ పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ నగేశ్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో డీఎస్‌ఓ నిత్యానంద్, సివిల్ సప్లై డీఎం జగదీశ్‌తో కలిసి రైస్ మిల్లర్లతో సమీక్ష నిర్వహించారు. ముందుగా మిల్లుల వారీగా కేటాయించిన ధాన్యం, ఇప్పటివరకు అప్పగించిన బియ్యం వివరాలను తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. యా సంగి 2024– 25 కోసం అందించాల్సిన సీఎంఆర్ బ్యాలెన్స్ బకాయిలపై కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు చెప్పారు. బకాయిలు ఉన్న మిల్లర్లు తమకు కేటాయించిన రోజువారీ టార్గెట్లను తప్పనిసరిగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. రోజు వారీ లక్ష్యాలను పూర్తి చేయకుంటే డిఫాల్టర్లుగా పరిగణిస్తామన్నారు. అలాగే వారికి కేటాయించిన ధాన్యాన్ని ఇతర మిల్లులకు బదిలీ చేస్తామన్నారు. సీఎంఆర్ డెలివరికి 2026 ఫిబ్రవరి 28 వరకు అవకాశం ఉందన్నారు. మిల్లర్లు గడువులోగా టార్గెట్ పూర్తి చేసి బాధ్యతాయుతంగా వ్యవహరించాలని అన్నారు.
నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు
మిల్లర్లతో అదనపు కలెక్టర్ నగేశ్


