మొసళ్లను పట్టుకుంటాం: డీఎఫ్‌ఓ
చేగుంట(తూప్రాన్): మండలంలోని వడియారం ఊర చెరువులో మొసళ్లను పట్టుకునేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా అటవీ అధికారి జోజీ అన్నారు. శుక్రవారం చెరువును సందర్శించి మాట్లాడారు. చెరువు విస్తీర్ణం, నీటి పరిమాణాన్ని అంచనా వేసి 10 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించనున్నట్లు తెలిపారు. సింగూరు డ్యాంకు చెందిన సిబ్బంది సహకారంతో చెరువులోని మొసళ్లను పట్టుకునేందుకు సత్వర చర్యలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. మొసళ్లు ఎక్కువ కాలం చెరువులో ఉంటే చేపలను తినేస్తాయని, త్వరగా పట్టుకునేందుకు చొరవ చూపించాలని డీఎఫ్‌ఓను జాలర్లు కోరారు. సాధ్యమైనంత త్వరగా పట్టుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. ఆయన వెంట ఎఫ్‌ఆర్వో అంబర్‌సింగ్, సెక్షన్ ఆఫీసర్ కిరణ్‌కుమార్, బీట్ ఆఫీసర్ రవికిరణ్ తదితరులు ఉన్నారు.


