వైజ్ఞానిక ప్రదర్శనలతో సృజనాత్మకత
కలెక్టర్ రాహుల్‌రాజ్
మెదక్‌జోన్: విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు వైజ్ఞానిక ప్రదర్శనలు ఎంతగానో ఉపయోగపడతాయని కలెక్టర్ రాహుల్‌రాజ్ అన్నా రు. గురువారం జిల్లా కేంద్రంలోని వెస్లీ ఉన్నత పాఠశాలలో సైన్స్ ఫెయిర్‌ను ప్రారంభించి మాట్లాడారు. విద్యార్థులు పుస్తకాలు చదవటంతో పాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలన్నారు. ఎంచుకున్న ఎగ్జిబిట్లు ఈ కాలానికి, మన దేశానికి అవసరమైనవిగా ఉన్నాయన్నారు. స్మార్ట్ ఫోన్ ద్వారా అందుబాటులో ఉన్న ఏఐని ఉపయోగించుకొని ఎలాంటి సమాచారం అయినా పొందగలిగే అవకాశం ఉందన్నారు. పోటీ పరీక్షలకు శిక్షణ ఇచ్చే అకాడమీ, ఫిజిక్స్ లాంటి సంస్థలతో ఒప్పందం కుదుర్చుకొని పాఠశాల విద్యార్థులందరికీ కోర్స్ మెటీరియల్ పొందే అవకాశం కల్పించామన్నారు. అనంతరం డీఈఓ విజయ మాట్లాడుతూ.. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని అభిరుచి, ఆసక్తికి అనుగుణంగా కోర్స్ ఎంచుకొని జీవితంలో రాణించాలని విద్యార్థులకు సూచించారు. ఇందుకోసం ఉన్న సౌకర్యాలను సంపూర్ణంగా వినియోగించుకోవాలన్నారు. సైన్స్ ఫెయిర్‌కు సంబంధించి 425 ఎగ్జిబిట్లు రాగా, ఇన్స్‌ఫెయిర్‌కు 50 ప్రాజెక్టులను ప్రదర్శించారు. కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి, పీఆర్‌టీయూ అధ్యక్షుడు సతీశ్‌రావుతో పాటు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.


