విధుల్లో నిర్లక్ష్యం వహించొద్దు
డీఎంహెచ్‌ఓ శ్రీరాం
మనోహరాబాద్(తూప్రాన్): విధుల్లో నిర్లక్ష్యం వ హిస్తే సహించేది లేదని డీఎంహెచ్‌ఓ శ్రీరాం హెచ్చరించారు. గురువారం మండలంలోని పీహెచ్‌సీని ఆకస్మికంగా తనిఖీ చేశారు. పలు రికార్డులు, మందులను పరిశీలించారు. రోగులతో మాట్లాడి వైద్యం ఎలా అందుతుందని ఆరా తీశారు. అనంతరం వైద్య సిబ్బందితో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. పలు అంశాలపై తగు సూచనలు చేశారు. ఆశవర్కర్లు ఎన్నికలు పూర్తయ్యే వ రకు గ్రామాల్లో అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ఆయన వెంట ప్రోగాం ఆఫీసర్ హరిప్రసాద్, డీపీఓ కోట, పీహెచ్‌సీ వైద్యులు జోష్నాదేవి ఉన్నారు.


