గుర్తుంచుకునేదెలా?
తూప్రాన్: పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థులకు కేటాయించే గుర్తులే కీలకం. అయితే ఈసారి ఎన్నికల్లో గుర్తులు తికమక పెట్టనున్నాయి. ఒకేలా ఉండే గుర్తులను కేటాయించటంతో గ్రామీణులు అయోమయానికి గురయ్యే అవకాశం ఉంది. కొందరు అభ్యర్థుల విజయ అవకాశాలు దెబ్బతీసే ప్రమాదం ఉంది. ఓటు వేసేందుకు పోలింగ్ బూత్‌లోకి వెళ్లిన ఓటరు, ముందుగా బ్యాలెట్ పేపర్ తీసుకొని తనకు కావాల్సిన అభ్యర్థి గుర్తును వెదుక్కుంటాడు. గుర్తులు తికమకపెడితే తాననుకున్న అభ్యర్థికే ఓటు వెస్తున్నానని అనుకొని మరొకరికి వేసే ప్రమాదం ఉంది. గత ఎన్నికల్లో రోడ్ రోలర్ గుర్తు ఓ అభ్యర్థికి, మరొకరికి ట్రక్కు గుర్తు కేటాయించారు. అది ఓటర్లకు సరిగ్గా తెలియకపోవడం వల్లే తాము ఓడిపోయామని కొందరు చెప్పుకున్నారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధాన పార్టీలకు ఉండే గుర్తులను ప్రజలకు పెద్దగా ప్రచారం చేయనక్కర్లేదు. పార్టీలకు అతీతరంగా జరిగే పంచాయతీ ఎన్నికల్లో మాత్రం కేటాయించే గుర్తులు ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. ప్రస్తుత ఎన్నికల్లో కీలకమైన గుర్తులు అభ్యర్థులను కలవరపెడుతున్నాయి. పలు గుర్తులు ఒకే నమూనాలో ఉండడమే ఇందుకు కారణం.
సర్పంచ్ అభ్యర్థుల గుర్తులివే..
బుట్ట, ఉంగరం, కత్తెర, కుట్టు మిషన్, బ్యాట్, పలక, టేబుల్, బ్యాటరీ, బ్రెష్, క్యారేట్, ల్యాంపు, టీవీ, చేతికర్ర, షటిల్ కాక్, దువ్వె న, మంచం, కప్పు సాసర్, కొవ్వొత్తి బ్యాలెట్ పేపర్లో ముద్రించారు.
వార్డు సభ్యులకు..
విద్యుత్ స్తంభం, గ్యాస్ స్టవ్, హార్మోనియం, టోపీ, ఇసీ్త్ర పెట్టే, తపాలా పెట్టె, ఫోర్క్, చెంచా, జగ్గు, గౌన్, స్టూలు, బీరువా, ప్రేషర్ కుక్కర్, ఐస్‌క్రీమ్ గుర్తులను కేటాయించారు.


