నాణ్యమైన నారు అందించాలి
డీఏఓ దేవ్‌కుమార్
తూప్రాన్: రైతులకు నాణ్యమైన, ఆరోగ్యవంతమైన కూరగాయలు, మొక్కలను అందించాలని జిల్లా వ్యవసాయాధికారి దేవ్‌కుమార్, ఉద్యాన, పట్టు పరిశ్రమ అధికారి ప్రతాప్‌సింగ్ అన్నారు. గురువారం మండలంలో కూరగాయల నర్సరీలను సందర్శించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. కూరగాయల మొక్కల నర్సరీలను తెలంగాణ నర్సరీ చట్టం నిబంధనలకు అనుగుణంగా సక్రమంగా నమోదు చేసుకోవడం ప్రతి నర్సరీ యజమాని బాధ్యత అన్నారు. నాణ్యమైన నారు మాత్రమే రైతులకు అందించడం ఈ చట్టం యొక్క ప్రధాన లక్ష్యమన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ అధికారి గంగుమల్లు, అధికారులు రైతులు పాల్గొన్నారు.


