రూ. 50 వేలు దాటితే సీజ్
తూప్రాన్: ఎన్నికల నియమావళి ప్రకారం రూ. 50 వేలు దాటితే నగదు స్వాధీనం చేసుకుంటామని డిప్యూటీ ఎన్నికల అధికారి, ఆర్డీఓ జయచంద్రారెడ్డి పేర్కొన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లలో భాగంగా గురువారం ఆర్డీఓ కార్యాలయంలో తహసీల్దార్లు, ఎఫ్‌ఎస్‌టీ, ఎస్‌ఎస్‌టీ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఎన్నికల నిబంధనలు, పర్యవేక్షణ విధానాలు, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలు, పోలింగ్ రోజున తీసుకోవాల్సిన జాగ్ర త్తలు, తదితర విధానాలపై అవగాహన కల్పించారు. ప్రతి అధికారి తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని సూచించారు.


