సజావుగా నామినేషన్లు ప్రక్రియ
అబ్జర్వర్ భారతీ లక్పతినాయక్
మెదక్ కలెక్టరేట్/చిన్నశంకరంపేట/రామాయంపేట: జిల్లాలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్లు ప్రక్రియ సజావుగా జరుగుతుందని జిల్లా ఎన్నికల జనరల్ అబ్జర్వర్ భారతీ లక్పతినాయక్ తెలిపారు. బుధవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణికుముదిని నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌కు కలెక్టర్ రాహుల్‌రాజ్, ఎస్పీ శ్రీనివాసరావుతో కలిసి పాల్గొన్నారు. అనంతరం ఆ మె మాట్లాడుతూ.. నిబంధనల ప్రకారం స్క్రూటిని ప్రక్రియ కొనసాగుతుందన్నారు. కలెక్టర్ రాహుల్‌రాజ్ మాట్లాడుతూ.. బ్యాలెట్ బాక్సులు, పత్రాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఈనెల 6న పోలింగ్ సిబ్బంది శిక్షణ, పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పిస్తున్నామని చెప్పారు. ఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. క్రిటికల్ పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం జరిగిందన్నారు. అంతర్ జిల్లాల చెక్‌పోస్ట్ ఏర్పాటు చేశామన్నారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని చర్యలు చేపడుతున్నామని తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్ నగేశ్, జెడ్పీ సీఈఓ ఎల్లయ్య,డీపీఓ యాదయ్య, అదనపు ఎస్పీ మహేందర్, జిల్లా రెవెన్యూ అధికారి భుజంగరావు, నోడల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం రామాయంపేటలో నామినేషన్ల పరిశీలన కార్యక్రమాన్ని భారతీ లక్పతినాయక్ పరిశీలించారు. అలాగే నార్సింగి మండల పరిషత్ కార్యాలయంలో నామినేషన్ల స్క్రూటిని పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు.


