వైజ్ఞానిక పండగకు వేళాయె
మెదక్‌జోన్: నేటి నుంచి పట్టణంలోని వెస్లీ ఉన్నత పాఠశాలలో నిర్వహించే జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. బుధవారం అదనపు కలెక్టర్ నగేశ్ ఏర్పాట్లను పర్యవేక్షించి మాట్లాడారు. గురు, శుక్రవారం వైజ్ఞానిక ప్రదర్శన కొనసాగతుందన్నారు. కాగా ఆన్‌లైన్ ద్వారా ఇప్పటివరకు రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల విద్యార్థులు మాత్రమే హాజరు కానున్నారని తెలిపారు. 6 నుంచి 10వ తరగతి వరకు అన్ని యాజమాన్యాల ప్రధానోపాధ్యాయులు హాజరుకావాలని సూచించారు. వీటిలో ప్రధానంగా అభివృద్ధి, స్వయం సంవృద్ధి, శాస్త్ర సాంకేతిక రంగాలైన సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్– గణితంపై ఎగ్జిబిట్ల తయారీ అంశాలు ఉంటాయన్నారు. జూనియర్ విభాగంలో 6, 7, 8 తరగతులతో పాటు సీనియర్ విభాగంలో 9, 10వ తరగతులను పరిగణిస్తారు. ఇప్పటివరకు సుమారు 400 ఎగ్జిబిట్స్, గత సంవత్సరం జిల్లాలోని వివిధ పాఠశాలలకు చెందిన 54 మంది ఇన్స్‌పైర్ అవార్డ్‌కు ఎంపికై న విద్యార్థుల ప్రాజెక్టులను ప్రదర్శనలో ఉంచుతామన్నారు. వెజ్ఞానిక ప్రదర్శనలో మొదటి స్థానం పొందిన వారు రాష్ట్రస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో పాల్గొంటారని తెలిపారు.
నేటి నుంచి వెస్లీ ఉన్నత ´ëuý‡-Ô>-ÌSÌZ OòܯŒ Þ òœÆ‡¬ÆŠḥæ


