భవిత కేంద్రాలతో భరోసా
డీఈఓ విజయ
పిల్లలతో మాట్లాడుతున్న డీఈఓ విజయ
నర్సాపూర్ రూరల్: మానసిక అంగవైకల్యం ఉన్న పిల్లల కోసమే ప్రభుత్వం భవిత కేంద్రాలను ఏర్పాటు చేసిందని డీఈఓ విజయ అన్నారు. బుధవారం నర్సాపూర్ భవిత కేంద్రంలో ప్రపంచ మానసిక అంగ వైకల్య దినోత్సవం సందర్భంగా ఎంఈఓ తారాసింగ్ అధ్యక్షతన ఏర్పాటు కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. మానసిక అంగవైకల్యం ఉన్న పిల్లల కోసం భవిత కేంద్రాల్లో ఆట పాటలతో కూడిన విద్య, ఫిజియోథెరపీతో పాటు వారికి కావాల్సిన వైద్య సహాయం అందిస్తున్నారని తెలిపారు. తల్లిదండ్రులు భవిత కేంద్రాలకు తీసుకువచ్చి ప్రభుత్వం అందించే అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం పిల్లలకు బహుమతులు ప్రదానం చేశారు.


