ఎలాంటి పొరపాట్లకు తావివ్వొద్దు
కలెక్టర్ రాహుల్‌రాజ్
మెదక్‌జోన్/చిన్నశంకరంపేట/హవేళిఘణాపూర్/మెదక్ కలెక్టరేట్/చేగుంట(తూప్రాన్): నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా సిబ్బంది పనిచేయాలని కలెక్టర్ రాహుల్‌రాజ్ సూచించారు. సోమవారం మెదక్, చిన్నశంకరంపేట, చేగుంట, హవేళిఘణాపూర్ మండల్లాలో నామినేషన్ల ప్రక్రియను పరిశీలించారు. ఎన్నికల సంఘం నిర్దేశించిన నిబంధనలను పాటిస్తూ ప్రక్రియను సజా వుగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. నామినేషన్ వేసే అభ్యర్థులు నూతన బ్యాంకు అకౌంట్ తప్పనిసరి అని అన్నారు. పాత అకౌంట్లు చెల్లుబాటుకావని గుర్తించాలన్నారు. జిల్లాలోని అన్ని బ్యాంకులకు నూతన అకౌంట్లు తెరిచేలా ఆదేశాలిచ్చినట్లు తెలిపారు. అనంతరం కలెక్టరేట్‌లో ఐడీఓసీలో స్టేజ్– 2 రిటర్నింగ్ అధికారులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో పాల్గొని సూచలిచ్చారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణలో మీ పాత్ర అత్యంత కీలకమని, ప్రతి ఒక్కరూ బాధ్యాయుతంగా పనిచేయాలని ఆదేశించారు. సమావేశంలో డీపీఓ యాదయ్య, జెడ్పీ సీఈఓ ఎల్లయ్య, డీఆర్డీఓ పీడీ శ్రీనివాసరావు, జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
»


