ఎన్నికల నియమావళి పాటించాలి
కలెక్టర్ రాహుల్‌రాజ్
తూప్రాన్/చిన్నశంకరంపేట(మెదక్): రెండో విడత నామినేషన్ ప్రక్రియ ఎనిమిది మండలాల్లో కొనసాగుతుందని కలెక్టర్ రాహుల్‌రాజ్ తెలిపారు. ఆదివారం తూప్రాన్ డివిజన్ పరిధిలోని తూప్రాన్, మనోహరాబాద్, నార్సింగి మండలాల్లో నామినేషన్ ప్రక్రియను పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నామినేషన్ వేసే అభ్యర్థులు నూతన బ్యాంక్ అకౌంట్ తప్పనిసరి అన్నారు. నామినేషన్ వేసే అభ్యర్థులకు ఎంపీడీఓ కార్యాలయాల వద్ద హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేశామన్నారు. ఎన్నికల నియమావళి అందరూ పాటించాలన్నారు. ఆయన వెంట తహసీల్దార్ చంద్రశేఖర్‌రెడ్డి, ఎంపీడీఓ శాలిక, సిబ్బంది ఉన్నారు. అనంతరం నార్సింగి మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహిస్తున్న రెండో విడత నామినేషన్ల ప్రక్రియను జెడ్పీ సీఈఓ ఎల్లయ్యతో కలిసి పరిశీలించారు. సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలకు వేలం వేసినట్లు సమాచారం అందితే ఎన్నిక రద్దు చేస్తామని హెచ్చరించారు. ఈసందర్భంగా ఎంపీడీఓ ప్రీతిరెడ్డి, తహసీల్దార్ గ్రేసిబాయికి పలు సూచనలు చేశారు.


