అవినీతిపై ఉక్కుపాదం
మెదక్ కలెక్టరేట్: ఉద్యోగులు ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధులుగా పనిచేయాలని, వృత్తి పట్ల నిబద్ధతతో నీతి నియమాలను అనుసరించాలని కలెక్టర్ రాహుల్‌రాజ్ అన్నారు. గురువారం కలెక్టరేట్‌లో జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అధికారులు, సిబ్బందిలో అవినీతి ఆలోచన ఉంటే విరమింపచేసుకోవాలని సూచించారు. ప్రజల పట్ల జాలి, కరుణ కలిగి ఉండాలన్నారు. పేదలను పీడి ంచే అవినీతి ఉద్యోగుల భరతం పడతామన్నారు. అవినీతిని కూకటి వేళ్లతో తొలగించడమే లక్ష్యంగా సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలోనే అవినీతి రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని ఉద్యోగులతో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం బాల్య వివాహాలు, డ్రగ్స్ నిర్మూలన, పోక్సో చట్టంపై అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బా ల్య వివాహాలను నిర్మూలించాలని, బాల కార్మికులు లేకుండా చూడాలని పేర్కొన్నారు. డ్రగ్స్ నిరోధకం, పోక్సో చట్టాలపై అవగాహన కల్పించి యువతి, యువకులు సన్మార్గం వైపు వెళ్లే విధంగా ప్రోత్సహించాలని సూచించారు.
కలెక్టరేట్‌లో తెలంగాణ తల్లి విగ్రహం
కలెక్టరేట్ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఇందుకోసం ఆర్‌అండ్‌బీ అధికారులతో కలిసి స్థల పరిశీలన చేశారు. త్వరలో విగ్రహం ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. జెడ్పీ సీఈఓ ఎల్లయ్య, డీఆర్డీఓ శ్రీనివాసరావు, డీఆర్‌ఓ భుజంగరావు, ఆర్డీఓ రమాదేవి, ట్రైనీ ఆర్డీఓ మహమ్మద్ అహ్మద్, డీడబ్ల్యూఓ హేమాభార్గవి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
పారదర్శక పాలనే లక్ష్యం
కలెక్టర్ రాహుల్‌రాజ్


