ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించాలి
నర్సాపూర్ రూరల్/కౌడిపల్లి(నర్సాపూర్): ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన లబ్ధిదారులు త్వరగా నిర్మాణాలు ప్రారంభించాలని రాష్ట్ర హౌసింగ్ సెక్రటరీ గౌతమ్ సూచించారు. గురువారం నర్సాపూర్ మండలం పెద్ద చింతకుంటలో అదనపు కలెక్టర్ నగేశ్, ఆర్డీఓ మహిపాల్‌తో కలిసి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మా ట్లాడుతూ.. నిర్మాణాలు కొనసాగిస్తున్న లబ్ధిదారులకు ఇప్పటికే ఆయా స్థాయిలో బిల్లులు మంజూరైనట్లు తెలిపారు. నిబంధనల ప్రకారం ఇళ్లు నిర్మించుకునే ప్రతి ఒక్కరికి బిల్లులు చెల్లిస్తామన్నారు. అనంతరం కౌడిపల్లి మండలంలోని ధర్మాసాగర్‌లో ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించి లబ్ధిదారులతో మాట్లాడారు. ఇంటి నిర్మాణానికి ఎంత ఖర్చు అ యింది, ఇప్పటివరకు బిల్లు ఎంత వచ్చిందని అడిగి తెలుసుకున్నారు.
రాష్ట్ర హౌసింగ్ కార్యదర్శి గౌతమ్


