మాదక ద్రవ్యాలను నిర్మూలిద్దాం
చిన్నశంకరంపేట(మెదక్): మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అదనపు కలెక్టర్ నగేశ్ పిలుపునిచ్చారు. గురువారం మండల కేంద్రంలోని రాధా స్టీల్, శ్రీమలానీ ఫోమ్స్ పరిశ్రమలో కార్మికులకు మాదక ద్రవ్యాల నిర్మూలనపై అవగాహన కల్పించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్మికులు మత్తు పదార్థాలకు అలవాటు పడి అనారోగ్యం పాలవుతున్నారని అన్నారు. ఆరోగ్యకరమైన జీవనం కోసం మత్తుకు దూరంగా ఉండాలని సూచించారు. కార్మికులు ఆరోగ్యంగా ఉంటేనే పరిశ్రమలతో పాటు కుటుంబం బాగుంటుందన్నారు. అనంతరం కార్మికులతో మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటామని ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో పరిశ్రమల శాఖ జీఎం ప్రకాశ్, రాధా స్టీల్ జీఎం గుప్త, హెచ్‌ఆర్ రమేశ్, ఆర్‌పీ సింగ్, శ్రీ మలానీ జీఎం ప్రవీణ్‌కుమార్ పాల్గొన్నారు.
అదనపు కలెక్టర్ నగేశ్


