దళారులను నమ్మి మోసపోవద్దు
కలెక్టర్ రాహుల్‌రాజ్
కౌడిపల్లి(నర్సాపూర్): రైతులు ధాన్యం అమ్ముకునేందుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని కలెక్టర్ రాహుల్‌రాజ్ తెలిపారు. బుధవారం మండలంలోని వెల్మకన్నలో సుడిగాలి పర్యటన నిర్వహించారు. ధాన్యం కొనుగోలు కేంద్రం, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రాలను తనిఖీ చేశారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో 498 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించామని చెప్పారు. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు. అనంతరం పాఠశాలను సందర్శించి విద్యార్థులతో బోర్డుపైన లెక్కలు చేయించారు. ప్రతి ఒక్కరూ శ్రద్ధగా చదవాలన్నారు. విద్యార్థుల అభివృద్ధికి ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. అలాగే రెండో అంగన్‌వాడీ కేంద్రాన్ని తనిఖీ చేసి మధ్యాహ్న భోజనం, విద్యా ర్థుల పూర్వ ప్రాథమిక విద్యను పరిశీలించారు. గ్రామంలో ఇందరిమ్మ ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలించి, ఇప్పటివరకు ఎంతమందికి బి ల్లులు వచ్చాయని అధికారులను అడిగి తెలుసుకున్నారు. త్వరగా నిర్మాణ పనులు పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ కృష్ణ, ఎంపీడీఓ శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శి ప్రవీణ్‌రెడ్డి, ఉపాధ్యాయులు, గ్రామస్తులు త దితరులు పాల్గొన్నారు.


