ఎఫెక్ట్‌ | - | Sakshi
Sakshi News home page

ఎఫెక్ట్‌

Oct 23 2025 9:18 AM | Updated on Oct 23 2025 9:18 AM

ఎఫెక్

ఎఫెక్ట్‌

ఇసుక ట్రాక్టర్ల పట్టివేత దరఖాస్తులు సత్వరమే పరిష్కరించాలి ఆ విద్యార్థులు క్షేమం మంత్రి వివేక్‌ సభలో నిలిచిన విద్యుత్‌ సరఫరా

కొల్చారం(నర్సాపూర్‌): ఇందిరమ్మ ఇళ్ల పేరిట అక్రమంగా మంజీరా నుంచి ఇసుక రవాణా చేస్తూ సొ మ్ము చేసుకుంటున్న విషయమై ఇటీవల ‘సాక్షి’లో ప్రచురితమైన ‘ఇసుకాసురులు’ కథనానికి రెవె న్యూ అధికారులు ఎట్టకేలకు స్పందించారు. బుధవారం మండలంలోని పైతర శివారు మంజీరా నది నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న మూడు ఇసుక ట్రాక్టర్లను తహసీల్దార్‌ శ్రీనివాస్‌చారి ఆధ్వర్యంలో పట్టుకున్నారు. పట్టుబడిన ట్రాక్టర్లను పంచాయతీ ఆధీనంలో ఉంచారు. గురువారం పూర్తిస్థాయి విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని తహసీల్దార్‌ తెలిపారు.

చిన్నశంకరంపేట(మెదక్‌): భూ భారతి దరఖాస్తులను వెంటనే పరిశీలించి పరిష్కరించాలని మెదక్‌ ఆర్డీఓ రమాదేవి అధికారులను ఆదేశించారు. బుధవారం చిన్నశంకరంపేట తహసీల్దార్‌ కార్యాలయంలో రెవెన్యూ సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. భూ భారతి రెవెన్యూ సదస్సు లో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి పరిష్కరించాలన్నారు. రైతులు కార్యాలయం చుట్టూ తిరగకుండా అధికారులు చొరవ చూపాలన్నారు. అనంతరం మండలంలోని చందంపేట ఎంఎస్‌ఎన్‌ పరిశ్రమపై గ్రామస్తులు ఫిర్యాదు చేయగా, కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో కలిసి పరిశ్రమ పరిసరాలను పరిశీలించారు. ఆమె వెంట కాలుష్య నియంత్రణ మండలి ఈఈ పఠాన్‌, తహసీల్దార్‌ మాలతి, ఆర్‌ఐ రాజు ఉన్నారు.

నర్సాపూర్‌ రూరల్‌: నర్సాపూర్‌ మైనార్టీ రెసిడెన్షియల్‌ స్కూల్‌కు చెందిన ఇద్దరు విద్యార్థులు మంగళవారం పారిపోయిన విషయం తెలిసిందే. విద్యార్థుల తల్లిదండ్రుల మధ్య జరిగిన గొడవల కారణంగా వేర్వేరుగా ఉంటున్నట్లు తెలిసింది. తండ్రి హైదరాబాద్‌లో ఉండగా, పిల్లలు వెతుక్కుంటూ తండ్రి వద్దకు వెళ్లినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. దీంతో పోలీసు లు పారిపోయిన విద్యార్థులు మహ్మద్‌ ఆమెర్‌, మహ్మద్‌ నవాజ్‌ అలీని బుధవారం స్కూల్‌లో అప్పగించారు. దీంతో పాఠశాల సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.

గజ్వేల్‌: పట్టణంలో బుధవారం రాత్రి జిల్లా ఇన్‌చార్జి మంత్రి వివేక్‌ చేతుల మీదుగా జరిగిన కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం సెల్‌ఫోన్‌ లైట్ల వెలుతురులో సాగింది. రాత్రి 7:20 గంటల ప్రాంతంలో మంత్రి వివేక్‌, కలెక్టర్‌ హైమావతి, ఎమ్మెల్సీ డాక్టర్‌ యాదవరెడ్డిలతో కలిసి పట్టణంలోని ఐవోసీ సమావేశ మందిరానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి కొద్దిసేపు ప్రసంగించారు. ఇంతలోనే కరెంటు సరఫరా నిలిచిపోయింది. దీంతో మంత్రితో పాటు వేదికపైన ఉన్న వారు ఇబ్బంది పడ్డారు. కొద్దిసేపు వేచి ఉన్నా కరెంటు రాకపోవడంతో మంత్రి వివేక్‌ చివరకు సెల్‌ఫోన్‌ లైట్ల వెలుతురుతో పాటు వీడియో కెమెరాల లైటింగ్‌లోనే కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. నియోజకవర్గంలోని 204 మంది లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేయాల్సి ఉండగా, కొందరికే సెల్‌ఫోన్‌ లైట్ల వెలుతురులో మంత్రి అందించారు. సుమారు 10 నిమిషాలకుపైగా కార్యక్రమం సాగింది. ఆ తర్వాత కరెంటు సరఫరా రావడంతో మంత్రి మరోసారి వేదికపై ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ తన ప్రసంగాన్ని కొనసాగించారు. కొద్దిసేపు ప్రసంగించి కార్యక్రమాన్ని ముగించుకొని వెళ్లిపోయారు. కాగా విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడానికి గల కారణాలను జిల్లా ఉన్నతాధికారులు ఆరా తీశారు. స్థానిక విద్యుత్‌శాఖ ఏఈ మారుతిని అక్కడికి పిలిపించి వివరణ అడిగారు. ఈ సందర్భంగా ముట్రాజ్‌పల్లిలోని ట్రాన్స్‌ఫార్మర్‌ ఇన్సులేటర్‌పై బల్లి పడటంతో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయిందని ఏఈ వివరణ ఇచ్చినట్లు తెలిసింది. చాలా సేపటి వరకు ఆ ఫీడర్‌లైన్‌ పునరుద్ధరణ కాకపోవడంతో ఐవోసీ వెనుకభాగంలో ఉన్న మరో ఫీడర్‌తో విద్యుత్‌ సరఫరాను పునరుద్ధరించినట్లు సమాచారం.

ఎఫెక్ట్‌1
1/2

ఎఫెక్ట్‌

ఎఫెక్ట్‌2
2/2

ఎఫెక్ట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement