
రిజర్వేషన్ల అమలుకు పోరాడుదాం
రామాయంపేట(మెదక్)): బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలు కోసం అలుపెరుగని పోరాటం చేస్తామని బీసీ సంక్షేమ సంఘం జిల్లా గౌరవాధ్యక్షుడు మెట్టు గంగారాం అన్నారు. బుధవారం పట్టణంలో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. తాము ఏ కులానికి వ్యతిరేకం కాదని, తమకు అన్యాయం తలపెట్టిన వారికి వ్యతిరేకంగా పోరాడుతామని హెచ్చరించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల దక్కకుండా కొందరు కుట్రలు పన్నుతున్నారని, వారి ఆటలు సాగబోవన్నారు. ఈనెల 18న నిర్వహించనున్న బంద్‌ను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం బంద్‌నకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో మెదక్ బీసీ జేఏసీ చైర్మన్ చంద్రశేఖర్, కోశాధికారి దామోదర్, ప్రధాన కార్యదర్శి భూమ కిషన్, సంఘం నియోజకవర్గ అధ్యక్షుడు సిద్దరాంలు, మండలాధ్యక్షుడు రాజేశ్ తదితరులు పాల్గొన్నారు.
బీసీ సంక్షేమ సంఘం
జిల్లా అధ్యక్షుడు గంగారాం