
సమస్యల పరిష్కారానికే ప్రజావాణి: అదనపు ఎస్పీ
మెదక్ మున్సిపాలిటీ: ప్రజావాణిని సద్వినియోగం చేసుకొని ప్రజలు తమ తమ సమస్యలను పరిష్కరించుకోవాలని అదనపు ఎస్పీ మహేందర్ సూచించారు. సోమవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నా రు. ఈసందర్భంగా ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ప్రజలు ఇతరుల ప్రమేయం లే కుండా నేరుగా సంప్రదించాలన్నారు. మొత్తం 13 ఫిర్యాదులు రాగా, వాటిని పరిశీలించి చట్టప్రకారం బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు చేపట్టాలని సంబంధిత పోలీస్ అధికారులను ఆదేశించారు. ప్రజల సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు జిల్లా పోలీస్ శాఖ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని తెలిపారు.
కౌడిపల్లి(నర్సాపూర్)/నర్సాపూర్: ఏ పంట లు సాగు చేశారు.. ఎన్ని దఫాలు యూరియా చల్లారు అంటూ రైతులను జిల్లా వ్యవసాయ అధికారి దేవ్‌కుమార్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. సోమవారం కౌడిపల్లి ఆగ్రోస్ రైతు సేవా కేంద్రానికి లారీ యూరియా లోడ్ రాగా, డీఏఓ తనిఖీ చేసి రైతులతో మాట్లాడారు. ఎకరాకు ఎన్ని బస్తాల యూరియా చల్లుతున్నారని ప్రశ్ని ంచారు. కాగా రైతులు వరి, పత్తి వేశామని రెండు, మూడో దఫా యూరియా చల్లుతున్నట్లు చెప్పారు. ఈసందర్భంగా డీఏఓ మాట్లాడుతూ.. యూరియా మోతాదుకు మించి వాడొవద్దని చెప్పారు. అధికంగా వాడటం వల్ల పంటలకు తెగులు సోకుతుందని చెప్పారు. సందేహాలకు వ్యవసాయ అధికారులను సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో ఏడీఏ పుణ్యవతి, టెక్నికల్ ఏడీఏ విన్సెంట్ వినయ్‌కుమార్, టెక్నికల్ ఏఓ వందన, ఏఈఓ నరేందర్, ఆగ్రోస్ యజమాని వెంకటేశంగుప్తా తదితరులు పాల్గొన్నారు. అనంతరం నర్సాపూర్ ఆగ్రోస్ కేంద్రంలో యూరియా అమ్మకాలు, రికార్డులను పరిశీలించారు.
చిన్నశంకరంపేట(మెదక్): ఫార్మా పరిశ్రమ మాకొద్దని మండలంలోని మిర్జాపల్లి గ్రామస్తులు ఆందోళనకు దిగారు. సోమవారం గ్రామ శివారులో నిర్మిస్తున్న పరిశ్రమ వద్దకు చేరుకొని పనులను నిలిపివేయించారు. ఎలాంటి గ్రామ సభ నిర్వహించకుండానే నిర్మాణ పనులు చేపట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడి నుంచే పీసీబీ అధికారులకు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేశారు. గ్రామ సభలో చర్చించే వరకు పరిశ్రమ పనులు చేపట్టవద్దని నిర్వాహకులను హెచ్చరించారు. కార్యక్రమంలో గ్రామ నాయకులు ప్రభా కర్, యాదగిరి, మనోజ్ పాల్గొన్నారు.
మెదక్ మున్సిపాలిటీ: దేవీశరన్నవరాత్రి ఉత్స వాల సందర్భంగా సోమవారం దుర్గామాత అమ్మవారి విగ్రహాల ఊరేగింపు కోలాహలంగా సాగింది. అమ్మవారి విగ్రహాలను డీజే, బ్యాండ్ మేళాలు, భజనలతో ఊరేగింపుగా తరలించా రు. దీంతో పట్టణంలో ఆధ్యాత్మిక సందడి నెలకొంది. ఓ వైపు వర్షం కురుస్తున్నా.. ఉత్సవ విగ్రహాల ఊరేగింపు భారీ ఎత్తున కొనసాగింది.

సమస్యల పరిష్కారానికే ప్రజావాణి: అదనపు ఎస్పీ

సమస్యల పరిష్కారానికే ప్రజావాణి: అదనపు ఎస్పీ