
సత్వరమే అర్జీలు పరిష్కరించాలి
● అదనపు కలెక్టర్ నగేశ్
● ప్రజావాణికి 65 వినతులు
మెదక్ కలెక్టరేట్: ప్రజావాణి అర్జీలను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ నగేశ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. మొత్తం 65 వినతు లు రాగా, అందులో అత్యధికంగా భూ సమస్య లు ఉన్నాయి. ఈసందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. వినతులను పెండింగ్‌లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరిపి పరిష్కరించాలని అధికాసూచించారు. కార్యక్రమంలో డీఆర్‌ఓ భుజంగరావు, జెడ్పీ సీఈఓ ఎల్లయ్య, అధికారులు పా ల్గొన్నారు. అంతకుముందు జిల్లా శిశు సంక్షేమ శాఖ అధ్వర్యంలో అదనపు కలెక్టర్, అధికారులకు పీహెచ్‌సీ సిబ్బంది వైద్య పరీక్షలు నిర్వహించారు.