
అవే బారులు.. తప్పని అవస్థలు
చేగుంట(తూప్రాన్)/శివ్వంపేట(నర్సాపూర్)/నిజాంపేట(మెదక్): యూరియా కోసం రైతులకు అవస్థలు తప్పడం లేదు. సోమవారం పలు మండలాల్లో బారులు తీరారు. చేగుంట మండల కేంద్రంలోని రైతుసేవా కేంద్రం వద్దకు పెద్ద ఎత్తున రైతులు చేరుకున్నారు. మండల వ్యవసాయ అధికారి హరిప్రసాద్ 1,120 బస్తాల యూరియాను రైతులకు అందించేందుకు చర్యలు చేపట్టారు. గొడవలు జరగకుండా పోలీసులు పర్యవేక్షించారు. శివ్వంపేట ప్రాథమిక సహకార సంఘం వద్ద రైతులు బారులు తీరారు. 540 బస్తాల యూరియా రావడంతో రైతులకు పంపిణీ చేశారు. అలాగే నిజాంపేట మండలం చల్మెడలో పెద్ద సంఖ్యలో రైతులు తరలివచ్చారు.

అవే బారులు.. తప్పని అవస్థలు