
ఈ నెలాఖరులోగా భూసేకరణ పూర్తి
● అధికారులు అలసత్వం వహించొద్దు
● కలెక్టర్ రాహుల్‌రాజ్
మెదక్ కలెక్టరేట్: ఈ నెలాఖరులోగా జాతీయ రహదారుల నిర్మాణానికి అవసరమైన భూ సేకరణ ప్రక్రియ పూర్తి చేయాలని కలెక్టర్ రాహుల్‌రాజ్ అధికారులను ఆదేశించారు. జాతీయ రహదారుల నిర్మాణం, విస్తరణకు అవసరమైన స్థల సేకరణపై సీఎం రేవంత్‌రెడ్డి సోమవారం సచివాలయం నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌కు జిల్లా ఫారెస్ట్ అధికారి జోజి, ఆర్డీఓలు రమాదేవి, మహిపాల్‌రెడ్డి, జయచంద్రారెడ్డితో కలిసి హాజరయ్యారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. సీఎం ఆదేశాల మేరకు దసరాకు ముందే అన్ని పనులు పూర్తి కావాలని స్పష్టం చేశారు. కోర్టు కేసులు ఉన్న భూములకు సంబంధించిన పూర్తి వివరాలను వెంటనే ప్రభుత్వానికి పంపాలని ఆదేశించారు. టైటిల్ సమస్యలు ఉన్న భూముల విషయంలో పరిహారం మొత్తాన్ని డిపాజిట్ చేసి, భూములను సేకరి ంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. రహదారి నిర్మాణ పనుల్లో జాప్యం జరగకుండా ప్రతి కేసును అత్యంత ప్రాధాన్యతగా పరిగణించాలని అధికారులను ఆదేశించారు. భూసేకరణలో ఎలాంటి ఆలస్యం జరుగకూడదని తెలిపారు.