
పండుగ పూట పస్తులుండాలా?
మెదక్ కలెక్టరేట్: పండుగ పూట పస్తులుండాలా..? ఐదు నెలలుగా వేతనాలు ఇవ్వకుంటే కుటుంబాలను ఎలా పోషించుకోవాలని పంచాయతీ కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం సీఐటీయూ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షురాలు నర్సమ్మ మాట్లాడుతూ.. పంచాయతీ కార్మికులకు ప్రభు త్వం ఐదు నెలలుగా వేతనాలు చెల్లించడం లేదన్నారు. బతుకమ్మ, దసరా పండుగలను వారు ఏ విధంగా జరుపుకుంటారని ప్రశ్నించారు. బయట అప్పులు అడిగినా ఎవరూ ఇచ్చే పరిస్థితిలో లేరన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి వెంటనే కార్మికుల పెండింగ్ వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. అనంతరం అదనపు కలెక్టర్ నగేశ్‌ను కలిసి డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి సంతోశ్, నాయకులు మల్లేశం, దుర్గ, పంచాయతీ యూనియన్ జిల్లా అధ్యక్షుడు మహేందర్, జిల్లా కార్యదర్శి ఆసీఫ్, నాయకులు పద్మారావు, రాములు, పోచయ్య, శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.
పంచాయతీ కార్మికుల ఆవేదన