
యూరియా తిప్పలు ఇంకెన్నాళ్లు!
యూరియా కోసం రైతులకు తిప్పలు తప్పడం లేదు. నర్సాపూర్‌లో బుధవారం యూరియా కోసం వచ్చిన రైతులకు అధికారులు టోకెన్లు ఇచ్చి పంపించారు. రైతు వేదికకు 400 యూరియా బస్తాలు వచ్చాయని, రైతులకు టోకెన్లు ఇచ్చినట్లు వ్యవసాయాధికారి దీపిక తెలిపారు. అలాగే వెల్దుర్తి మండల కేంద్రంలోని రైతు వేదిక వద్ద యూరియా కోసం రైతులు బారులు తీరారు. ఉదయం 4 గంటల నుంచే రైతు వేదిక వద్ద యూరియా బస్తా కోసం క్యూలో నిల్చున్నారు. నిత్యం యూరియా కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నామని వాపోయారు. ప్రభుత్వం రైతులకు సరిపడా యూరియా సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. – నర్సాపూర్/వెల్దుర్తి(తూప్రాన్)
వెల్దుర్తిలో యూరియా కోసం బారులు తీరిన రైతులు

యూరియా తిప్పలు ఇంకెన్నాళ్లు!